Aerospace Engineering: ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకొంటే? 7 d ago

మీకు విమాన ప్రయాణం, అంతరిక్ష అన్వేషణపై ఆసక్తి ఉందా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై మంచి అవగాహన ఉందా? మీరు సంక్లిష్టమైన (కష్టమైన) సమస్యలను పరిష్కరించడం, సరికొత్తగా(క్రియేటివిటీ) ఆలోచించే నైపుణ్యాలను కలిగి ఉన్నారా? అయితే మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ను ఎంచుకోవచ్చు.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ భూమి యొక్క వాతావరణంలో లేదా బాహ్య అంతరిక్షంలో పనిచేసే వాహనాల రూపకల్పన, అభివృద్ది, నిర్మాణం, పరీక్ష, నిర్వహణకు సంబంధించిన ఇంజనీరింగ్ రంగం. యాక్చువల్ గా ఆ పదంలోనే ఉంటుంది స్పేస్ ఇంజినీరింగ్ అంటే స్పేస్‌లోకి వెళ్లే రాకెట్స్ , శాటిలైట్స్ దాకా కూడా మీ కెరీర్‌ను ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదవాలన్న ఆసక్తి, పాషన్ ఉన్న వారు ఈ బ్రాంచ్‌ని ఎంచుకోవచ్చు.
రాష్ట్ర స్ధాయిలో...
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్ స్ధాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ తీసుకొని ఆయా సబ్జెక్టుల్లో మంచి ప్రావీణ్యం ఉండాలి. అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారానే ఏరోనాటికల్ బ్రాంచ్‌లో ప్రవేశం కల్పిస్తారు.
జాతీయ స్ధాయిలో....
జాతీయ స్ధాయిలో ఐఐటీ, నిట్‌లు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలు జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
ఉద్యోగాలు:
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏరోనాటికల్ స్పేస్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. ఏరోస్పేస్ ఇంజినీర్, ఆస్ట్రోనామికల్ ఇంజనీర్, ప్రొపల్షన్ సిస్టమ్స్ ఇంజనీర్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, ఏరోనాటికల్ ఇంజనీర్, ఏరోనాటికల్ మెకానికల్ ఇంజినీర్ మొదలైన ఉద్యోగాలు ఉంటాయి. ISRO, NASA, DRDO, HAL వంటి సంస్ధలలో అలాగే విమాన సంస్ధలు, అంతరిక్ష పరిశ్రమలు, రాకెట్ మరియు ఉపగ్రహ నిర్మాణ కంపెనీలలో అవకాశాలు ఉంటాయి.
ఇది చదవండి: ప్రపంచ వ్యాప్తంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్